News

పార్లమెంట్ వక్ఫ్ ఆస్తి అట… బద్రుద్దీన్ వ్యాఖ్యలు

251views

ప్రజల ఆస్తి అయిన పార్లమెంట్ విషయంలో AIUDF చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ సంచలన ప్రకటన చేశారు. పార్లమెంట్ భవనం, దాని పరిసర ప్రాంతాలు వక్ఫ్ ఆస్తులపై నిర్మించారట. అలాగే వసంత విహార్ చుట్టుపక్కల ప్రదేశాలు, దేశ రాజధానిలోని విమానాశ్రయం వరకూ విస్తరించిన వున్న ప్రాంతం మొత్తం వక్ఫ్ ఆస్తిపైనే నిర్మించారని అన్నారు.

అనుమతులు లేకుండా వక్ఫ్ భూమిని ఉపయోగించడం పెద్ద తప్పు అని, వక్ఫ్ బోర్డుకి సంబంధించిన 9.7 లక్షల బీఘా భూములను కూడా ప్రభుత్వం లాక్కోవాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. వక్ఫ్ భూములన్నింటినీ ముస్లింలకు అప్పజెప్పాలన్నారు. మోదీ ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే… కేంద్రంలోని ప్రభుత్వం పడిపోవడం ఖాయమని బెదిరింపులకు దిగారు.