News

14 ఎత్తయిన పర్వతాలను అధిరోహించిన నేపాల్‌ యువకుడు

367views

ప్రపంచంలో అత్యంత ఎత్తయిన 14 పర్వతాలను అధిరోహించిన అతి పిన్న వయస్కుడిగా నేపాల్‌కు చెందిన నిమా రింజి షెర్పా(18) రికార్డు సృష్టించారు. గతవారం ఈ యువకుడు చైనాలోని 8,027 మీటర్ల (26,335 అడుగుల) ఎత్తైన షిషపంగ్మా పర్వతాన్ని అధిరోహించి ప్రపంచంలో 8,000 మీటర్లకుపైగా (26,247 అడుగులకుపైగా) ఎత్తున్న పర్వతాలను అధిరోహించాలన్న కలను నెరవేర్చుకున్నాడు. గతంలో 30 ఏళ్ల వయసున్న ఓ షెర్పా ఈ ఘనత సాధించారు. మరోవైపు, నేపాల్‌ చేరుకున్న నిమా రింజీకి రాజధాని కాఠ్‌మాండూలోని త్రిభువన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆ దేశ పర్యటక శాఖ మంత్రి బద్రీ ప్రసాద్‌ పాండే సహా పలువురు ఘనంగా స్వాగతం పలికారు.