
237views
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లెలోని బోయకొండ గంగమ్మ ఆలయానికి ఆదివారం ఇంటిగ్రల్ సర్టిఫికెషన్ లిమిటెడ్ (ఐసీఎల్) సర్టిఫికెట్ ను ఆ సంస్థ సీఈవో రామలక్ష్మి, డైరెక్టర్ సాయిశ్రీనివాస్ నుంచి అందుకున్నట్లు ఆలయ ఈవో ఏకాంబరం తెలిపారు. ఆలయంలో నిర్వహించే పుష్ప సేవా టికెట్ల వివరాలను ఐసీఎల్ సేకరించింది. ఇందులో భాగంగా ఆలయంలో రూ.50 టికెట్ కు భక్తులకు 3 పుష్పాలను ఆలయవర్గాలు అందజేస్తాయి. భక్తులు ఆ పుష్పాలను అమ్మవారికి కుడి, మధ్య, ఎడమ వైపు అలంకరిస్తారు. పుష్పం కుడి వైపున వెంటనే కిందకు పడిపోతేకోరిన కోర్కె వెంటనే తీరుతుందని, మధ్యలో ఉన్న పుష్పం పడిపోతే ఆలస్యం అవుతుందని, ఎడమ వైపున పుష్పం కిందకు పడిపోతే ఆ కోరిక అస్సలు తీరదని భక్తుల విశ్వాసం.వీటిని గుర్తించి ఐసీఎల్, న్యూఢిల్లీ ధృవీకరణ పత్రాన్ని జారీ చేసిందని ఈవో చెప్పారు.





