News

జపాన్ సంస్థకు నోబెల్ శాంతి పురస్కారం

245views

జపాన్ సంస్థ నిహాన్ హిడాంక్యోను ప్రఖ్యాత నోబెల్ పురస్కారం వరించింది. 2024 సంవత్సరానికి గాను ఈ సంస్థకు నోబెల్ శాంతి పురస్కారాన్ని నోబెల్ కమిటీ ప్రకటించింది. అణ్వాయుధాలు లేని ప్రపంచాన్ని సృష్టించేందుకు గాను ఈ సంస్థ చేస్తున్న ప్రయత్నానికి గాను నోబెల్ శాంతి బహుమతి లభించింది.

ది నార్వేజియన్ నోబెల్ కమిటీ ఈ పీస్ ప్రైజ్ ను నిహాన్ హిడాంక్యో సంస్థకు ప్రకటించింది. హిరోషిమా, నాగసాకి అణుబాంబు ఘటనలో ప్రాణాలతో బయటపడిన వారి నుంచి ఈ అణుబాంబురహిత ఉద్యమం ప్రారంభమైంది. అణుబాంబు దాడుల నుంచి ప్రాణాలతో బయటపడిన వారికి ఈ సంస్థ సేవలు అందిస్తోంది.