News

హనుమంతుడు ముస్లిమట.. రోజూ నమాజ్ చేస్తాడట

247views

హనుమంతుడు ముస్లిమట. అలాగే రోజూ నమాజ్ చేస్తాడట. అంతేకాకుండా స్వయంగా రాముడే నమాజ్ చేయమని ఆయనకు చెప్పాడట. ఇదీ ఓ ముస్లిం టీచర్ విద్యార్థులకు బోధిస్తున్న పాఠం. ఇది జరిగింది బిహార్ లోని బెగుసరాయ్ పాఠశాలలో. దీంతో పాఠశాలలోని కొందరు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ఉపాధ్యాయుడు జియాదుద్దీన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలతో స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది.

జియాదుద్దీన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయగానే.. విద్యార్థులు ఈ విషయాన్ని వెంటనే తమ తల్లిదండ్రులకు తెలియజేశారు. తల్లిదండ్రులు, స్థానికులు అప్పుడే పాఠశాలకు చేరుకొని, తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. జియాదుద్దీన్ బేషరుతుగా వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమన్నారు. ఇలా ఎందుకు వ్యాఖ్యలు చేశారో చెప్పాలంటూ తల్లిదండ్రులు ఉపాధ్యాయుడ్ని నిలదీసిన వీడియోలు కూడా వున్నాయి. విద్యార్థులు కూడా తగిన సాక్ష్యాలు చూపించడంతో తల్లిదండ్రులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు.

మతపరమైన ఉద్రిక్తతలు నెలకొల్పడానికే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని పలువురు మండిపడుతున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు సామాజిక వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తాయని, ఇదో కుట్ర అని, ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని హిందువులు, తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ విషయంపై నేరుగా సీఎం నితీశ్ కుమార్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు విషయం పెద్దది కావడంతో విద్యాశాఖ అధికారులు కూడా పాఠశాలకు చేరుకున్నారు. విచారణ కూడా ప్రారంభించారు. అయితే.. తాను అలా అనలేదని జియాదుద్దీన్ అధికారులను కూడా బుకాయించారు.