News

‘భారతమాతకు జై’ నినాదం సమరసతను పెంచేదే!

341views

‘భారతమాతకు జై’ అన్న నినాదంలోని తత్త్వం ఏమిటి? తాజాగా కర్ణాటక హైకోర్టు చెప్పింది ఆలకిస్తే అది బాగా అర్ధమవుతుంది. అలాగే హైకోర్టు ఇలాంటి వివరణ ఎందుకు ఇవ్వవలసి వచ్చిందో కూడా గమనించాలి. బహుశా తరువాత సిగ్గు పడాలి. కనీసం కాంగ్రెస్ వాళ్ళు తలదించుకోవాలి. ఇదీ కోర్టువారి నిర్వచనం- ‘భారతమాతకు జై అన్న నినాదం సామరస్యాన్ని పెంచేది మాత్రమే. ఆ నినాదం వైరుధ్యాలకు దారి తీసేది కాదు’. భారతమాతకు జై అని నినదించి, ముస్లిం మతోన్మాద గూండాల చేతిలో కత్తిపోట్లకు, గాయాలకు గురైన ఒక బృందం మీద కర్ణాటక పోలీసులు పెట్టిన కేసు విచారణకు వచ్చినప్పుడు హైకోర్టు ఆ విధంగా స్పందించింది. సురేశ్ కుమార్, ఎం. వినయ్కుమార్, సుభాష్, రంజన్, ధనుంజయ్ అనే ఐదుగురు దాఖలు చేసిన వ్యాజ్యం మీద జస్టిస్ ఎం. నాగప్రసూన ఈ వివరణ ఇచ్చారు. ఇంతకీ జరిగింది ఏమిటి?

సరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన జూన్ 9, 2024న పిటిషనర్లు ఆ సంబరాలలో పాల్గొని తిరిగి వస్తున్నారు. బొల్యార్ గ్రామంలోని (ఉల్లాల్ తాలూకా) సమాధాన్ బార్ సమీపంలోకి వచ్చేసరికి వారి మీద దాదాపు 25 మంది దాడికి దిగారు. ఈ ఐదుగురు చేసిన నేరం ఒకటే- భారతమాతకు జై అంటూ నినాదాలు ఇవ్వడమే. వీరిలో సురేశ్ను ఆ దుండగులలో ఒకడు పొట్టలో కత్తితో పొడిచాడు. నందకుమార్ ను కూడా వీపు మీద కత్తితో గాయపరిచారు. ఆ రాత్రి 11 గంటలకు పోలీసులకు వీరు ఫిర్యాదు చేశారు. కేసు నమోదైన తరువాత ఫిర్యాదును రిజిస్టర్ చేశారు. అయితే మరుసటి రోజు మరొక ఫిర్యాదు సమోదైంది. దీనిని పీకే అబ్దుల్లా అనేవాడు చేశాడు. మొహియుద్దీన్ జుమా మసీదు వద్ద (బొల్యార్) తనను ఆ ఐదుగురు బెదిరించారని అతడి ఫిర్యాదు. ఈ దేశం విడిచిపోవాలని ఆదేశించారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఆ ఐదుగురి మీద 153ఏ సెక్షన్ కింద నమోదు చేయడం ఆ సెక్షన్ ను దారుణంగా దుర్వినియోగం చేయడమేనని జస్టిస్ నాగప్రసూన తీర్పు చెప్పారు. రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం సృష్టించడానికి ప్రయత్నించిన వారి మీద నమోదు చేస్తారు. అయితే భారతమాతకు జై అన్న నినాదం వైరుధ్యాలను పెంచదనీ, సామరస్యాన్ని పంచుతుందని న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు.