ArticlesNews

వక్ఫ్ బోర్డు మీద గెలిచిన ఝాన్సీ రాణి

610views

1857 ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంలో ఈస్టిండియా కంపెనీ ఝాన్సీ లక్ష్మీబాయిని ఓడించి, యుద్ధంలోనే చంపింది. కానీ 2024లో ఆ మహా యోధురాలి విగ్రహం వక్ఫ్ బోర్డును న్యాయపోరాటంలో ఓడించి దేశానికి కొత్త స్ఫూర్తిని ఇచ్చింది. అదెలా జరిగింది?

కొన్ని ముస్లిం సంఘాలలో రోజు రోజుకీ మతోన్మాదం వెర్రితలలు వేస్తున్నది. నిజం చెప్పాలంటే పెట్రేగిపోతోంది. ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో హిందువులు, ముస్లింలు కలసి పోరాడారు. విప్లవకారులు ఆఖరి మొగల్ చక్రవర్తి బహుదుర్ షా జఫార్ ను విప్లవ నాయకునిగా ప్రకటించారు. నానాసాహెబ్, తాత్యాతోపే, ఝాన్సీ లక్ష్మీబాయి, రాజా కున్వార్సింగ్ వంటివారు ఆ విధంగా చరిత్రకు ఎక్కారు. కానీ ఇప్పుడు ఏమైంది? ఢిల్లీలోని షాహీ ఈద్గా పార్కులో ఆవిష్కరించదలచిన ఝాన్సీ లక్ష్మీబాయి విగ్రహ ప్రతిష్ఠ జరగకుండా ఆపవలసిందంటూ ఢిల్లీ షాహీ ఈద్గా మేనేజింగ్ కమిటీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిమీద గట్టిగానే చీవాట్లు పెడుతూ సెప్టెంబర్ 25వ తేదీన కోర్టు తీర్పు వెలువరించింది. కమిటీ పిటిషన్ కొట్టివేస్తూ, చరిత్రను మతాల ఆధారంగా చూడకూడదని గడ్డి పెట్టింది. కులమతాలకు అతీతంగా అంతా గౌరవించే జాతీయ నాయకురాలు రాణీ లక్ష్మీబాయి అని కోర్టు వ్యాఖ్యానించింది. కోర్టు ద్వారా మతోన్మాద క్రీడకు తెగించడం సరికాదని కూడా హెచ్చరించింది. నిజానికి షాహీ ఈద్గా కమిటి వేసిన పిటిషనను ఇదివరకే హైకోర్టు కొట్టివేసింది. అయినా మళ్లీ మరొక ధర్మాసనానికి అప్పీలు చేసింది.

ఈద్గా కేసు విభజనకు దారి తీసేదని, పైగా కోర్టు సమయాన్ని వృథా చేసిందని విమర్శించింది.మొదటి ఒకే న్యాయమూర్తి ఉన్న ధర్మాసనం ఇచ్చిన తీర్పును విమర్శిస్తూ ఈద్గా కమిటీ, న్యాయమూర్తి
న్యాయబద్ధంగా వ్యవహరించలేదని వ్యాఖ్యానించినందుకు కూడా న్యాయమూర్తి కమిటీని దుయ్యబట్టారు. మోతీఖాన్ ప్రాంతంలో ఉన్న (ఢిల్లీలో ఉన్న సదర్ బజార్ ప్రాంతంలోని విగ్రహం పెట్టదలచిన ప్రదేశం వక్ఫ్ కు చెందుతుందని పిటిషన్లో కమిటీ పేర్కొన్నది. కాబట్టి ఆ ప్రాంతంలో, ఆ పార్కులో ఎవరి విగ్రహాలు ప్రతిష్టించకుండా సంయమనం పాటించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కమిటీ కోరింది. నిజానికి దేశ రాజధానిలోని రాణీ లక్ష్మీబాయి మార్గ్ ను వెడల్పు చేసే క్రమంలో ఆ స్వాతంత్య్ర సమరయోధురాలి విగ్రహాన్ని వేరొక చోటికి తరలించవలసి వచ్చింది. ఆ క్రమంలోనే
విగ్రహాన్ని ఈద్గా పార్కులో ప్రతిష్ఠించాలని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది. ఇంత జరిగాక ఈద్గా కమిటీ కోర్టుకు వ్యాజ్యాన్ని ఉపసంహరించుకోవడానికి అనుమతి కోరింది. ఇలాంటి
సమాజ ఆగ్రహానికి గురి అయ్యే, సమయం వృథా చేసే వాదనలు కోర్టుకు తెచ్చినందుకు మొదట క్షమాపణ చెప్పి వ్యాజ్యం ఉపసంహరించుకోవచ్చునని కోర్టు చెప్పింది. ఈ వివాదమంతా త్వరలో
జరగబోయే ఎన్నికలలో మైనారిటీ ఓట్ల కోసం ఆప్ సృష్టించినదేనని బీజేపీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు సచిదేవ్ ఆరోపించారు. కాబట్టి వక్ఫ్ బోర్డు తమవని ప్రకటించుకున్న భూములలో, ప్రాంతాలలో జాతీయ నాయకుల విగ్రహాలు కూడా ఉండకూడదన్నమాట. అంటే వక్ఫ్ చట్టాన్ని సవరించడం కాదు, యమునలో నిమజ్జనం చేయవలసిన అవసరమే ఎక్కువ.