News

తిరుమలలో కనులపండువగా శ్రీవారి మహా రథోత్సవం

341views

శ్రీవారి బ్రహ్మోత్సవాలు తిరుమలలో వైభవంగా సాగుతున్నాయి. దీనిలో భాగంగా శుక్రవారం ఉదయం మహా రథోత్సవాన్ని నిర్వహించారు. వేడుకలో భక్తులు పెద్దఎత్తున పాల్గొని జయజయధ్వానాలు చేశారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి తిరుమాడ వీధుల్లో విహరించారు. గోవింద నామస్మరణతో భక్తులు రథాన్ని లాగారు.

శుక్రవారం రాత్రి స్వామివారు అశ్వ వాహనంపై కల్కి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. దీంతో వాహన సేవలు పూర్తి కానున్నాయి. శనివారం చివరి ఘట్టమైన చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే తితిదే ఈవో శ్యామలరావు పరిశీలించారు. భక్తులు ప్రశాంతంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఏర్పాట్లు చేశారు. పుష్కరిణిలో ఇబ్బంది లేకుండా భద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్నారు.