News

శ్రీమహాలక్ష్మీ దేవి అలంకారంలో దుర్గమ్మ

260views

ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు శ్రీమహాలక్ష్మీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
ఈ మహలక్ష్మీదేవి ప్రభావం గురించి ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోర్ధనంవసుః ర్ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే ॥ శ్రీ సూక్తంలో చెప్పపడింది.

అలాగే లక్ష్మీతంత్రం అనే గ్రంథంలో కూడా రాజ్యవిద్యాచ సౌభాగ్య అమృతకామ్య పరాదికాః సత్యభోగయోగలక్ష్మ్యై అష్టాచ ప్రకీర్తితాః॥ అని కొలిచారు.

“యాదేవీ స‌ర్వ‌భూతేషు సంస్థితా..” అంటే స‌మ‌స్త జీవుల్లోనూ ఉండే ల‌క్ష్మీ స్వ‌రూపం దుర్గాదేవి… అని చండీ సప్త‌శ‌తి చెబుతోంది. కాబ‌ట్టి శ‌ర‌న్న‌వ‌రాత్రుల్లో ల‌క్ష్మీదేవిని పూజిస్తే ఆ త‌ల్లి స‌ర్వ‌మంగ‌ళ‌కారిణిగా ధ‌న‌, ధాన్య‌, ధైర్య‌, విజ‌య‌, విద్య‌, సౌభాగ్య‌, సంతాన భాగ్యాల‌ను ప్ర‌సాదిస్తుంది. శ్రీమ‌హాల‌క్ష్మీ దేవిగా ద‌ర్శ‌న‌మిచ్చే క‌న‌క‌దుర్గ‌మ్మ‌కు ఈ రోజున నైవేద్యంగా పంచ‌భోగాలైన పాయ‌సం, చ‌క్ర‌పొంగ‌లి, ల‌డ్డూ, పులిహోర‌, ద‌ద్దోజ‌నాల‌ను నివేదిస్తారు.