News

శ్రీకాకుళంలో ‘గోవు ఘోష విను గోవిందా’

24views

బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా పిలుపు మేరకు శ్రీకాకుళం జిల్లా బిజెపి కిసాన్ మోర్చా విభాగం ఆధ్వర్యంలో ‘గోవు ఘోష విను గోవిందా’ అంటూ గోమాతతో చారిత్రక శివాలయం శ్రికాకుళం నగరం బలగ మెట్టు వద్ద ఉన్న చారిత్రిక శివాలయం వద్ద నిర్వహించారు.. ఈ సందర్భంగా బిజెపి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు బిర్లంగి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పినది వాస్తవమే నేను గడ్డి తింటాను, తౌడు తింటాను. ఏది పడితే అది తింటాను.. కానీ అయిన చెప్పినట్టు కలుషితమైన పాలు ఇవ్వను కలుషితం అయిన నెయ్యిని ఇవ్వను. శ్రేష్టమైన నెయ్యిని ఇస్తాను. మంచి ఆహారం తింటూ.. కలుషిత నెయ్యి గోవిందునికి పెట్టింది నన్ను నిందించిన మనుషులే అని గోమాత తన ఘోషను గోవిందునికి వినిపించింది అని బిర్లంగి తెలియజేశారు.

అన్యమతస్తులు టిటిడి బోర్డు చైర్మన్ గా నియమించిన నాడే బిజెపి రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకిస్తూ దేవాలయాలు వద్ద సంతకాలు సేకరించడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆధ్వర్యంలో గవర్నర్ కు సమర్పించడం జరిగింది. ఆరోజు వైసిపి ప్రభుత్వ తీసుకున్న అనేక నిర్ణయాలకు ప్రతీక ఈరోజు కలుషిత నెయ్యి వేంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డులో వాడడం జరిగింది అన్నారు. అత్యున్నత ప్రమాణాలు కలిగిన ల్యాబ్ ద్వారా ఇది నిరూపితం అయ్యింది. దీనికి సమాధానం చెప్పకుండా వైసిపి పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాలకు వెళ్ళి పూజలు చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. గో పంచకంతో గుడులు శుభ్రం చేసే కార్యక్రమం రాష్ట్ర కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరుగుతున్నాయని శ్రీకాకుళంలో నేడు ఇదే పని చేశామని అన్నారు. వేంకటేశ్వర స్వామి వారి సన్నిధికి వెళ్తాను అని చెప్పి వెళ్ళని జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇచ్చి వెళ్లాలని హితవు పలికారు. భగవంతుని పట్ల నమ్మకం నిజంగా ఉంటే డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళడానికి మీకున్న సమస్య ఏమిటి అని ప్రశ్నించారు.వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో హిందువుల దేవాలయాలపై దాడులు రథాలు తగలబెట్టిన వైనం ఇలా అనేక దురాగతాలకు బాధ్యత వహించాలి అని దుయ్యబట్టారు.