News

అక్టోబర్‌ 3 నుంచి.. ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు

29views

దసరా నవరాత్రులకు ఇంద్రకీలాద్రి ముస్తాబవుతున్నది. కనకదుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. అక్టోబర్‌ 3న ఘట స్థాపనతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అదే నెల 12న విజయదశమి వేడుకతో ముగుస్తాయి. అదే రోజు సాయంత్రం కృష్ణా నదిలో తెప్పోత్సవం జరుగనుంది. శరన్నవరాత్రులు దుర్గాదేవి అవతారాలను శక్తి, జ్ఞానానికి సంబంధించిన దేవతగా పూజిస్తారు. ముల్లోకాలకు మూలపూటమ్మ దుర్గమ్మను ఆశ్వయుజ మాసంలో వచ్చే శరన్నవరాత్రులలో దర్శిస్తే ఐహిక సుఖాలతో పాటు మోక్షాన్ని కూడా పొందవచ్చనని భక్తులు విశ్వసిస్తారు. ఇక దసరా నవరాత్రుల్లో అమ్మవారు ఏ రోజు ఏ అలంకారంలో దర్శణమిస్తారో తెలుసుకుందాం..

అమ్మవారి అలంకారాలు..
అక్టోబర్‌ 3- బాలాత్రిపుర సుందరీ దేవి అలంకారం
అక్టోబర్‌ 4- గాయత్రీ దేవి అలంకారం
అక్టోబర్‌ 5- అన్నపూర్ణా దేవి అలంకారం
అక్టోబర్‌ 6- లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారం
అక్టోబర్‌ 7- మహా చండీ దేవి అలంకారం
అక్టోబర్‌ 8- మహాలక్ష్మీ దేవి అలంకారం
అక్టోబర్‌ 9- సరస్వతీ దేవి అలంకారం (మూల నక్షత్రం)
అక్టోబర్‌ 10- దుర్గా దేవి అలంకారం (దుర్గాష్టమి )
అక్టోబర్‌ 11- మహిషాసుర మర్దిని దేవి అలంకారం (మహర్నవమి)
అక్టోబర్‌ 12- ఉదయం మహిషాసుర మర్దిని దేవిగా, సాయంత్రం రాజరాజేశ్వరి దేవిగా అలంకారం (విజయదశమి)