News

అసత్య ప్రచారాన్ని ఖండించిన టీటీడీ

501views

పవిత్రమైన శ్రీవారి లడ్డు ప్రసాదంలో పొగాకు పొట్లం ఉన్నట్లు, కొంతమంది సోషల్ మీడియాలో వైరల్ చేయడం భావ్యం కాదని టీటీడీ పేర్కొంది.

తిరుమలలోని లడ్డూ పోటులో శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు అత్యంత భక్తిశ్రద్ధలతో, నియమ నిష్ఠలతో, శ్రీవారి లడ్డూలను ప్రతీరోజు లక్షలాదిగా తయారు చేస్తారని టీటీడీ ప్రకటనలో వివరించింది.

ఈ లడ్డూల తయారీ కూడా సీసీటీవీల పర్యవేక్షణలో ఉంటుందని పేర్కొంది. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కోరారు. ఇంతటి పకడ్బందీగా లడ్డూ ప్రసాదం తయారు చేసే వ్యవస్థలో ఈ విధంగా పొగాకు ఉన్నట్లు ప్రచారం చేయడం బాధాకరమన్నారు.