News

రాజమహేంద్రవరం సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో పుస్తకావిష్కరణ

48views

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో సద్గురు మలయాళ స్వామి 105 సం.ల క్రితం వ్రాసిన మోక్షానికి అర్హత కులమా గుణమా పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.ముళ్లపూడి గంగాధర రావు గారు సద్గురు మలయాళ స్వామి విగ్రహానికి పూల మాల వేయడంతో సభ ప్రారంభం అయింది.సభ ఉద్దేశాన్ని వోలేటి సత్యన్నారాయణ వివరించారు.ఆంధ్ర ప్రదేశ్ సమర సత సాహిత్య ప్రముఖ్ ఐనాడ దుర్గా ప్రసాద్ స్వామి వారి జీవన సందేశంపై గీతాన్ని ఆలపించారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్త,ముఖ్య అతిథిగా జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, ప్రధాన వక్తగా డా.వడ్డీ విజయసారథి, ప్రముఖ పాత్రికేయులు, పుస్తక రచయిత వల్లీశ్వర్, స్వామి భక్తురాలు బిక్కిన ప్రభావతి, ప్రముఖ న్యాయవాది త్రవ్వల వీరేంద్రనాథ్ పాల్గొని ప్రసంగించారు.సామాజిక సమరసత చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించారు.

ఈ సందర్బంగా జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మాట్లాడుతూ , వివిధ కులాల మధ్య సమతను ఆచరణలో చూపాలని వాటిని పాఠ్యాంశాలుగా చేయాలని కోరారు పుస్తక రచయిత వల్లిశ్వర్ తన సందేశంలో మలయాళ స్వామి రచనలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించడాన్ని ఆయన రచించిన గ్రంథాలను వాటి భావాలను వివరించారు. పుస్తకంలోని ప్రధాన సారాంశాలను విపులీకరించారు.

సభకు ముదరా ప్రవీణ్ అధ్యక్షత వహించారు. ప్రాంత సహ్ కన్వీనర్ రాజా రామ చంద్ర రాజమహేంద్రవరం సమరసత కమిటీని ప్రకటించారు.సభలో సుమారు 400 మంది పాల్గొన్నారు. సభ ముగింపులో జొన్నవిత్తుల, వల్లీశ్వర్, బిక్కిన ప్రభావతిలను నిర్వాహకులు సన్మానించారు.

ఈ సభలో ఎస్సీ,ఎస్టీ,హక్కుల సంక్షేమ వేదిక జాతీయ కన్వీనర్ శ్యాం ప్రసాద్, రాష్ట్ర అధ్యక్షులు గరికిముక్కు సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.