
గుంటూరు జిల్లా కొలనుకొండలోని హరేకృష్ణ గోకుల క్షేత్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శించి పూజలు చేశారు. గర్భాలయంలో నిర్వహించిన అనంతశేష స్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వేంకటేశ్వర ఆలయ నిర్మాణంలో భాగంగా ఇక్కడ అనంతశేష స్థాపన చేశారు. అంతకు ముందు అక్కడికి చేరుకున్న చంద్రబాబుకు ఆలయ నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొన్నారు. అక్షయ పాత్ర అంతర్జాతీయ అధ్యక్షుడు మధుపండిత్, మంత్రులు నారాయణ, సవిత, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు.
అమరావతిలో నూతన ఆధ్యాత్మిక ఒరవడికి శ్రీకారం చుట్టడం శుభసంకేతమని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఆధ్యాత్మికతతో పాటు సంస్కృతి, ఆచార వ్యవహారాలను కాపాడటం ముఖ్యం. ఇస్కాన్ సంస్థ ఎంతో మందికి అన్నదానం కూడా చేస్తోంది. అక్షయ పాత్ర ద్వారా ఇస్కాన్ సంస్థ తోడ్పాటునిచ్చింది. ఎవరూ అర్ధాకలితో ఉండకూడదనే అక్షయపాత్ర అన్నదానం చేస్తోంది’’ అని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు.





