అయోధ్య రామాలయ అర్చకుల డ్రెస్ కోడులో కొత్త మార్పులు రానున్నాయి. ఇప్పటి నుంచి వారు కొత్త వేష ధారణలో కనిపిస్తారు. సంప్రదాయంగా ఇప్పుడు ధరిస్తున్న కుంకుమ కలర్ వస్త్రాల స్థానంలో ప్రకాశవంతమైన పసుపు రంగు తలపాగా, కుర్తా మరియు ధోతీలను ట్రస్ట్ ప్రవేశపెట్టింది. అంతేకాకుండా ఇక నుంచి గర్భగుడిలోకి స్మార్ట్ ఫోన్లను కూడా అర్చకులు తీసుకెళ్లకూడదని నిషేధం విధించింది. అలాగే మరి కొన్ని అంశాల విషయంలో కూడా మార్పులు చేర్పులు జరిగాయి. అర్చకుల వేష ధారణలో ఏకరూపత (యూనిఫాం) సాధించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని, అలాగే.. ఎంత మంది మధ్యలో వున్నా… ఎక్కడ వున్నా… అర్చకులను ఇట్టే పసిగట్టగలగడం వీలవుతుందని, అందుకే డ్రెస్ కోడ్ మారుస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధాన అర్చకునితో పాటు 20 మంది అర్చకులు, ట్రైనీ అర్చకులకు కూడా ఇది వర్తించనుంది. ఇప్పటి వరకు కొందరు కుంకుమ కలర్ వస్త్రాలు, మరి కొందరు పసుపు రంగు దుస్తులు ధరిస్తున్నారు. ఇప్పటి నుంచి కొత్త డ్రెస్ కోడ్లతో కనిపించనున్నారు.
450views
You Might Also Like
ఆలయ ప్రదక్షిణ : భక్తి, వినయం, అంతర్ముఖతకు ఆధ్యాత్మిక మార్గం
హిందూ ధర్మంలో ప్రతి ఆచారానికీ ఒక అంతరార్థం ఉంటుంది. ఆలయానికి వెళ్లడం, గర్భాలయ దర్శనం చేసుకోవడం, తీర్థప్రసాదాలు స్వీకరించడం, నమస్కరించడం వంటి ప్రతి సంప్రదాయమూ మనిషిని బాహ్య...
‘అద్వైతసిద్ధి’కి తెనాలి పరీక్ష
తెనాలి పరీక్ష". నేడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశ మైంది. ఇంతకీ ఏమిటీ పరీక్ష.. అంత కఠినంగా ఉంటుందా.. దేశం మొత్తమ్మీద ఒక్క తెనాలిలోనే ఎందుకు నిర్వహిస్తారు? ప్రధాని...
దయ చూపండంటున్నా.. మహిళకు షరియా శిక్ష 100 కొరడా దెబ్బలు
13
ఇండోనేషియాలోని వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళకు అక్కడి అధికారులు దారుణమైన శిక్ష విధించారు. అచే ప్రావిన్సులో ఈ ఘటన చోటుచేసుకుంది. బహిరంగంగా శిక్ష అమలు చేస్తున్న సమయంలో...
ఇరాన్లో హిజాబ్ నిబంధనలకు సవాల్.. స్కార్ఫ్ లేకుండానే 10K రేసులో పాల్గొన్న మహిళలు
11
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో జరిగిన 10 కిలోమీటర్ల రన్నింగ్ రేసులో పలువురు మహిళలు తలపై హిజాబ్ లేదా స్కార్ఫ్ ధరించకుండా పాల్గొన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా...
శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకోండి.. విద్యార్థులకు అజిత్ డోభాల్ పిలుపు
32
జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగాలని భారత జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ డోభాల్ విద్యార్థులకు సూచించారు. ఇందుకోసం శ్రీరాముడి జీవితాన్ని ఆదర్శంగా...
పాకిస్తాన్‌కు తాలిబాన్ వార్నింగ్.. ఆఫ్ఘన్‌లోకి అడుగుపెడితే తీవ్ర పరిణామాలే..
10
పాకిస్థాన్, తాలిబాన్ల మధ్య విభేదాలు మళ్లీ తీవ్ర రూపాన్ని దాల్చాయి. ఇటీవల పాకిస్థాన్‌లో జరిగిన ఒక భారీ తీవ్రవాద దాడి తర్వాత, ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వం ఇస్లామాబాద్‌కు...





