News

పారిస్ ఒలింపిక్స్‌లో తెలుగు జ్యోతులు

224views

మరికొన్ని రోజుల్లో ఒలింపిక్ క్రీడోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 26 నుంచి ఆగస్టు 11 వరకు జరిగే ఒలింపిక్స్‌కు ఈసారి ఫ్రాన్స్ రాజధాని పారిస్ మహానగరం ఆతిథ్యమిస్తోంది. స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా సారథ్యంలో భారత్‌ బరిలో దిగనుంది. మొత్తం 28 మంది భారత అథ్లెట్లు ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నారు. అందులో 17 మంది పురుషులు కాగా 11 మంది మహిళలు.

పురుషులు: అవినాష్‌ సాబ్లె (3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌), నీరజ్‌ చోప్రా, కిషోర్‌కుమార్‌ జెనా (జావెలిన్‌ త్రో), తజిందర్‌పాల్‌ తూర్‌ (షాట్‌పుట్‌), ప్రవీణ్‌ చిత్రవేల్, అబ్దుల్లా అబూ బాకర్‌ (ట్రిపుల్‌ జంప్‌), అక్ష్దీప్‌ సింగ్, వికాస్‌ సింగ్, పరమ్‌జీత్‌సింగ్‌ బిస్త్‌ (20 కిమీ రేస్‌ వాక్‌), మహ్మద్‌ అనాస్, మహ్మద్‌ అజ్మల్, అమోజ్‌ జాకబ్, సంతోష్‌ తమిళరసన్, రాజేశ్‌ రమేశ్‌ (4×400 మీ రిలే), మిజో చాకో కురియన్‌ (4×400 మీ రిలే), సూరజ్‌ పన్వర్‌ (రేస్‌ వాక్‌ మిక్స్‌డ్‌ మారథాన్‌), సర్వేష్‌ అనిల్‌ కుశారె (హైజంప్‌)

మహిళలు: కిరణ్‌ పహల్‌ (400 మీ), పారుల్‌ చౌదరి (3000 మీ స్టీపుల్‌ఛేజ్, 5000 మీ), జ్యోతి యర్రాజి (100 మీ హర్డిల్స్‌), అన్ను రాణి (జావెలిన్‌ త్రో), అభా ఖతువా (షాట్‌పుట్‌), జ్యోతికశ్రీ దండి, శుభ వెంకటేశన్, విథ్య రామరాజ్, పూవమ్మ (4×400 మీ రిలే), ప్రాచి (4×400 మీ), ప్రియాంక గోస్వామి (20 కీమీ రేస్‌ వాక్‌/ రేస్‌ వాక్‌ మిక్స్‌డ్‌ మారథాన్‌)

వీరిలో మన రాష్ట్రానికి చెందిన జ్యోతి యర్రాజి, దండి జ్యోతిక శ్రీ ఉన్నారు.