News

రోజూ నమాజ్ చేస్తున్నాడు… అందుకే ఖైదీకి ఉరి శిక్ష రద్దు చేసిన హై కోర్ట్

52views

అత్యాచారం కేసులో దోషిగా తేలిన వ్యక్తి మరణశిక్షను ఒడిశా హైకోర్టు జీవిత ఖైదుగా మారుస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.వాస్తవానికి ఆరేళ్ల మైనరన బాలికపై అత్యాచారం మరియు హత్య కేసులో రేపిస్ట్ అకీల్ అలీకి మరణశిక్షను విధించారు. అయితే.. అలీ ఇప్పుడు పదే పదే నమాజ్ ప్రార్థనలు చేసుకుం… పశ్చాత్తాపపడుతున్నాడని, నేరాన్ని అంగీకరించేందుకు సిద్దంగా వున్నాడని తెలిపింది. అందుకే అతడికి విధించిన మరణశిక్షను జీవిత ఖైదుగా మారుస్తున్నట్లు కోర్టు తీర్పునిచ్చింది. జస్టిస్ ఎస్.కె. సాహూ మరియు జస్టిస్ ఆర్కే పట్నాయక్ ఈ తీర్పు వెలువరించారు. దీనికి సంబంధి 106 పేజీల సుదీర్ఘ తీర్పును ఒడిశా హైకోర్టు ఇచ్చింది. అయితే.. బాధిత బాలిక కుటుంబానికి 1.50 లక్షల పరిహారాన్ని ఇవ్వాలని పోక్సో కోర్టు ఆదేశించగా… దాన్ని కూడా హైకోర్టు సవరించింది.

బాధిత బాలిక కుటుంబానికి 10 లక్షల పరిహారాన్ని అందించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో దోషిగా తేలిన అలీ రోజూ దేవుడ్ని ప్రార్తిస్తున్నాడు. రోజులో ఎన్నో సార్లు నమాజ్ చేస్తున్నాడు. అతడు దేవుడి ముందు లొంగిపోయాడు. తాను చేసిన నేరాన్ని అంగీకరించడానికి సిద్దంగా వున్నాడు. అందుకే అతడికి విధించిన మరణ శిక్షను జీవిత ఖైదుగా మారుస్తున్నామని తీర్పు సమయంలో హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. అలాగే 63 ఏళ్ల వయస్సున్న తల్లి, ఇద్దరు అవివాహిత సోదరీమణులు వున్నారని, వారంతా అతనిపైనే ఆధారపడ్డారని, అతని కుటుంబ ఆర్ధిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదని కోర్టు పేర్కొంది. పైగా జైలులోనూ అతను సత్ప్రవర్తనతో ఉన్నాడని బెంచ్ పేర్కొంది. అయితే.. కోర్టు తీర్పుపై చాలా విమర్శలు వస్తున్నాయి.