News

తైవాన్‌తో భారత్‌ సన్నిహిత సంబంధాలు కోరుకోవడంపై చైనా అభ్యంతరం

96views

తైవాన్‌తో భారత్‌ మరింత సన్నిహిత సంబంధాలు కోరుకుంటున్నట్లు ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యపై చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తైవాన్‌ అధికారుల రాజకీయ సమీకరణాలను నిరోధించాలంటూ భారత్‌కు సూచించింది. మోదీ వ్యాఖ్యపై ఇప్పటికే దౌత్యపరంగా నిరసన తెలియజేశామని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్‌ గురువారం బీజింగ్‌లో విలేకర్ల సమావేశంలో పేర్కొన్నారు. మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమైన నేపథ్యంలో తైవాన్‌ అధ్యక్షుడు లై చింగ్‌-తె ఆయనకు ‘ఎక్స్‌’ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా పెంచుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు. స్పందించిన మోదీ.. చింగ్‌-తెకు ధన్యవాదాలు తెలిపారు. తైవాన్‌తో ఉభయతారక సన్నిహిత సంబంధాలు కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.