ArticlesNews

మావోయిస్టులకి వ్యతిరేకంగా గిరిజనుల ర్యాలీలు

70views

అల్లూరి సీతారామరాజు జిల్లాలో గత నెలలో మావోయిస్టులపై గిరిజనులు మావోయిస్టులకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేపట్టి, వారిపై నిప్పులు గక్కారు. సీలేరులోని జీకే వీధి మండలం దారకొండ, గుమ్మిరేవులు, దుప్పిలివాడ గ్రామ పంచాయతీల పరిధిలోని గిరిజనులు మావోయిస్టులకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు.

ఇక తాజాగా తూర్పు గోదావరి జిల్లాలోని గిరిజనులు కూడా మావోయిస్టులపై మండిపడుతున్నారు. భారీ ప్రదర్శనలకు దిగుతున్నారు.గత మే మాసంలో చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి వారాంతపు సంతలో గిరిజనులు మావోయిస్టులకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు, ప్లకార్డులతో ర్యాలీలు చేశారు. అటవీ భూములపై హక్కు గిరిజనులకే అని మావోయిస్టులు పదే పదే చెబుతుంటారని, కానీ.. తునికాకుల కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు అందకపోతే మాత్రం ఆ తునికాకు బసవ్తలను కాల్చేసవ్తరని మండిపడుతున్నారు. తమ గ్రామాల్లో రహదారులు వేసశ్తీ అటవీ ససపద దోచుకోవడానికే అంటూ అడ్డుకుంటారని, కాంట్రాక్టర్‌ గనుక డబ్బులిసశ్తీ రహదారి పనులను అడ్డుకోరని, లేదంటే పనుల యంత్రాలను తగలబెడతారని గిరిజనులు వెల్లడిరచారు.తమ గిరిజన సవదరులను చంపుతున్న మావోయిసఱ్టలను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేసఱ్తన్నారు. అమాయకులైన మమ్మల్ని పనులకు వాడుకుంటూ… తిరిగి తమనే బలిపశువులను చేసవ్తరా? అంటూ గిరిజనులు మండిపడ్డారు.