శ్రీశైల మహక్షేత్రంలో బుధవారం అమావాస్య ఘడియలను పురస్కరించుకొని సాయంత్రం శ్రీశైలక్షేత్రపాలకుడైన బయలు వీరభద్ర స్వామికి పరోక్ష సేవగా విశేష అభిషేక పూజలు చేశారు. కార్యక్రమంలో మహాగణపతికి ప్రత్యేక పూజాధికాలు నిర్వహించి వీరభద్రస్వామికి పంచామృతాల తోనూ, బిల్వోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, భస్మో దకం, గంధోదకం, పుష్పోదకం, శుద్ధజలాలతో వీరభద్ర స్వామికి విశేష అభిషేక పూజలు నిర్వహించారు. స్వామి పరోక్షసేవలో మొత్తం 16 మంది భక్తులు ఆన్లైన్ ద్వారా రూ. 1,116 సేవారుసుమును చెల్లించి జరిపించుకున్నారు. శ్రీశైల క్షేత్రానికి స్వయంగా విచ్చేయలేని భక్తులు పాల్గొనేందుకు దేవస్థానం ఈ పరోక్షసేవల ద్వారా అవ కాశం కల్పించింది. ప్రతి నెల అమావాస్య రోజులలో బయలువీరభద్రస్వామికి జరిపే పరోక్ష సేవలో భక్తులు పాల్గొనవచ్చని దేవస్థానం ఈవో డి. పెద్దిరాజు తెలిపారు. దేవస్థానం వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ.శ్రీశైలదేవస్థానం. ఒఆర్జీ ద్వారా ఒక్కో పూజకు రూ. 1,116 సేవా రుసుమును చెల్లించి ఏ సేవలో అయిన పాల్గొనవచ్చు. స్వామి రుద్రాభిషేకం, అమ్మవారి కుంకు మార్చన మినహ మిగతా అన్నీ సేవలను భక్తులు శ్రీశైల టీవీ, యూట్యూబ్ చానెల్ ద్వారా వీక్షించవచ్చునని తెలిపారు.
204views
You Might Also Like
పాకిస్థాన్ ఆపరేటివ్ షాజాద్ భట్టి నెట్వర్క్కు చెందిన 9 మంది అరెస్ట్
29
భారత్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ కొత్త ఆయుధాన్ని ప్రయోగిస్తోందా? సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ముసుగులో యువతను ఉగ్రవాదం వైపు మళ్లిస్తూ, దాడులకు కుట్రలు...
ఈ ఏడాది చివర్లో ‘మత్స్య 6000’ ప్రయోగం
36
మత్స్య 6000’ జలాంతర్గామిని ఈ ఏడాది అక్టోబరు- డిసెంబరు మధ్య సముద్రంలోకి పంపనున్నట్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ(ఎన్ఐవోటీ) డైరెక్టరు బాలాజీ రామకృష్ణన్ తెలిపారు. ఇందులో...
600 మంది రేప్ చేశారు – పాక్ ముఠాల ఆగడాలపై బ్రిటన్ ఎంపీ
33
బ్రిటన్లో లైంగిక వేధింపుల ముఠాల అరాచకాలపై అక్కడి చట్టసభ మరోసారి చర్చించింది. అనేక రాష్ట్రాల్లో చిన్నారులు, మహిళల లైంగిక దోపిడీకి సంబంధించి స్వతంత్ర దర్యాప్తు నివేదికలోని సంచలన...
40 ఏళ్లుగా అంధులకు సేవలు చేస్తున్న స్వామి బ్రహ్మదేవ్
‘‘సర్వేంద్రియాణాం నయనం ప్రధానం’’ అని అంటాం. నిజానికి పంచేంద్రియాలూ ప్రధానమే. కానీ కళ్లు అన్నింటికి కంటే ప్రధానం. అవి వుంటేనే లోకాన్ని చూడగలం. అవే లేకపోతే.. జీవితమే...
భక్తుల ఆరోగ్య భద్రతే టీటీడీ ప్రధాన లక్ష్యం– టీటీడీ అదనపు ఈవో
35
భక్తుల ఆరోగ్యం, ఆహార భద్రతకు టీటీడీ అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలోని ఎస్వీ మ్యూజియం ఆడిటోరియంలో,...
ద్విముఖ జిహాద్ : ఒకే లక్ష్యం.. రెండు భిన్న మార్గాలు…
జిహాద్.. ఈ పదాన్ని మనం కేవలం ఉగ్రవాద కోణంలోనే చూస్తుంటాం. కానీ సమకాలీన ప్రపంచంలో, ఇది ఒక బహుముఖ వ్యూహంగా రూపాంతరం చెందింది. దేశ భౌతిక సరిహద్దుల...





