News

హితకారిణి సమాజం ఆధ్వర్యంలో కందుకూరి వీరేశలింగం వర్ధంతి వేడుకలు

71views

రాజమహేంద్రవరంలోని హితకారిణి సమాజం ఆధ్వర్యంలో సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం 105వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎస్.కె.వి.టి డిగ్రీ కాలేజి ప్రిన్సిపాల్ రాజబాబు, తెలుగు విభాగాధిపతి డా. పి.వి.బి సంజీవ రావు తదితర నగర ప్రముఖులు రాజమహేంద్రవరం ఆనంద గార్డెన్స్ వద్ద కందుకూరి దంపతుల సమాధుల వద్ద పుష్పాలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం మాజీ ఎమ్మెల్యే రౌతు మాట్లాడుతూ తెలుగు సమాజం యొక్క సామాజిక పునరుజ్జీవనం, వితంతు పునర్వివాహాలు, స్త్రీ విద్య, బాల్య వివాహాల నిర్మూలనలో కందుకూరి వీరేశలింగం కీలక పాత్ర పోషించారన్నారు. ప్రగతిశీల విలువలను పెంపొందించడానికి నవలలు, వ్యాసాలు మరియు నాటకాలతో తెలుగు సాహిత్యానికి గణనీయమైన కృషి చేశారని తెలిపారు. హితకారిణి సమాజం సహాయ కమిషనర్ మరియు కరస్పాండెంట్ సింగం రాధా మాట్లాడుతూ ఆయన స్థాపించిన హితకారిణి సమాజం కందుకూరి వారసత్వాన్ని కొనసాగిస్తూ సామాజిక సంస్కరణ, లింగ సమానత్వం మరియు మహిళా సాధికారతకు కృషి చేస్తుందన్నారు. ఈ సందర్భంగా సుమారు 300 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు .