203views
పశ్చిమబెంగాల్ రాష్ట్రం జల్పాయిగుడి జిల్లా లోని తమ ఆశ్రమంపై ఆదివారం కొందరు దుండగులు దాడి చేశారని రామకృష్ణ మిషన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. సాయుధులైన దుండగులు ఆశ్ర మంలో ఉన్న సాధువులు, ఉద్యోగులకు తుపాకులు ఎక్కుపెట్టి ఆ ప్రాంగణాన్ని ఖాళీ చేయాలని బెదిరించారని ఆరోపించింది. అనంతరం విధ్వంసానికి పాల్పడ్డా రని, సీసీటీవీ కెమేరాలను పగులగొట్టారని, వెళ్తూవెళ్తూ మెయిన్ గేటుకు తాళం వేశారని పేర్కొంది. తమ భూమిని కబ్జా చేయాలని చూస్తున్నారని తెలిపింది. పోలీసులు వచ్చి తాళం బద్దలుకొట్టి సాధువులను, సిబ్బందిని బయటకు తీసుకొచ్చారని తెలిపింది.





