
అరుణాచలగిరి ప్రదక్షిణ కోసం ఈనెల 22వ తేదిన తిరువన్నామలైకి కడప రీజియన్ పరిధిలోని వివిధ డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని వైయస్సార్ జిల్లా ప్రజా రవాణాధికారి గోపాల్‌రెడ్డి తెలిపారు. కడప డిపో నుంచి రాత్రి 8 గంటలకు రాయచోటి, చిత్తూరు, వేలూరు మీదుగా బస్సు బయలుదేరుతుందన్నారు. సూపర్‌లగ్జరీ బస్సులో రూ. 1072గా చార్జి నిర్ణయిచినట్లు చెప్పారు. బద్వేలు డిపో నుంచి ఉదయం 7 గంటలకు గోల్డెన్ టెంపుల్, కాణిపాకం మీదుగా, మరో బస్సు అదే సమయంలో పెంచలకోన, శ్రీకాళహస్తి, గోల్డెన్ టెంపుల్, కాణిపాకం మీదుగా వెళుతుందన్నారు. అల్ట్రా డీలక్స్ సర్వీసులో రూ. 1566, సూపర్ లగ్జరీలో రూ. 1475 చార్జి ఉంటుందన్నారు. మైదుకూరు డిపో నుంచి పోరుమామిళ్లలో ఉదయం 6 గంటలకు, మరో బస్సు సాయంత్రం 6 గంట లకు మైదుకూరు నుంచి కడప, రాయచోటి మీ దుగా వెళుతుందన్నారు. సూపర్ లగ్జరీ బస్సులో రూ. 1414, 1188గా చార్జి ఉంటుందన్నారు. ప్రొద్దుటూరు డిపో నుంచి మధ్యాహ్నం 3 గంటలకు ఇంద్ర ఏసీ బస్సు కడప మీదుగా వెళుతుందన్నారు. ఇందులో రూ. 1569 చార్జి ఉంటుందన్నారు. జమ్మలమడుగు నుంచి రాత్రి 8.00 గంటలకు ప్రొద్దుటూరు, మైదుకూరు, కడప మీదుగా బస్సు బయలుదేరుతుందన్నారు. టిక్కెట్ ధర రూ. 1352గా ఉందన్నారు. పులివెందుల డిపో నుంచి రాత్రి 8.00 గంటలకు బస్సు బయలుదేరి పీలేరు, గోల్డెన్ టెంపుల్ మీదుగా అరుణాచలంకు సర్వీసు వెళుతుందన్నారు. ఇందులో రూ. 1242 టిక్కెట్ ధరగా నిర్ణయించారన్నారు.





