227views
శ్రీకాకుళం జిల్లా టెక్కలి మేఘవరం పంచాయతీ జక్కరపేట జంక్షన్ సమీ పంలో వనదుర్గమ్మ తల్లి విగ్రహా న్ని ఎవరో గుర్తుతెలియనివారు ధ్వంసం చేశారని గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల కిందట జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఎలా జరిగిందన్న అంశంపై ఆరాతీస్తున్నారు. గిరిజనులు, గ్రానైట్ క్వారీల కార్మికులు ఎంతో పవిత్రంగా పూజించిన వనదుర్గమ్మ విగ్రహం ధ్వంసం కావడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. కాగా ఈ విషయపై దర్యాప్తు చేస్తున్నామని సీఐ పి.పైడయ్య స్పష్టం చేశారు.





