
30views
జమ్మూ కాశ్మీర్.. భారత్ కే మకుటాయమానం. అడుగడుగునా గుడి వుంది. ఎన్నో దేవాలయాలు. అక్కడి హిందువులకు నిరంతరం శ్రద్ధా కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి. అయితే కాశ్మీర్ లోని కుప్వారాజిల్లా, హంద్వారా సెక్టార్ లో ఓ భద్రకాళీ దేవాలయం వుంది. అటవీ ప్రాంతంలో, కొండలపైన ఈ దేవాలయం వుంది. భారత సైన్యానికి చెందిన ‘‘రాష్ట్రీయ రైఫిల్స్’’ ఈ దేవాలయానికి రక్షణ కల్పిస్తూ వుంటుంది.
అయితే.. కొన్ని శతాబ్దాల నాటి అమ్మవారి విగ్రహం ఒకానొక సమయంలో ఈ దేవాలయం నుంచి అదృశ్యమైంది. దీంతో స్థానికంగా కలకలం రేగింది. అయితే.. దీనిని ఓ ఇస్లామిక్ ఉగ్రవాద ముఠా దొంగలించిందని స్థానికులు నిర్ధారణకు వచ్చారు.
అయితే.. ఈ దొంగలించిన ఉగ్రవాద ముఠాలోనే ఒకానొక సమయంలో తీవ్ర విభేదాలు పుట్టుకొచ్చాయి. ఈ విభేదాలతో ముఠా చెల్లాచెదురైంది. రెండేళ్ల తర్వాత సైనిక చర్యలో భాగంగా ఈ అమ్మవారి విగ్రహాన్ని తన వద్దే వుంచుకున్న ఉగ్రవాదిని సైన్యం హతమార్చింది. దీంతో భద్రకాళి అమ్మవారే ఇలా చేసిందని స్థానికుల ప్రగాఢ నమ్మకం. ఆ తర్వాత సైన్యం యథావిథిగా భద్రకాళీ అమ్మవారి విగ్రహాన్ని తిరిగి దేవాలయానికి తీసుకొచ్చింది.
కాశ్మీర్ లోయలో హిందువులు మరియు ముస్లింలు ఇద్దరూ ప్రార్థనలు చేసే కొన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయన్న విషయాన్ని గమనించాలి. మాతా ఖీర్ భవానీ (అనంతనాగ్), మాతా వైష్ణో దేవి (కత్రా, జమ్మూ), శారదా ఆలయం మరియు మటాన్ సాహిబ్ వంటి ప్రదేశాలను హిందువులు, ముస్లింలు ఎంతో కాలంగా సందర్శించి తమ భక్తిని చాటుకుంటున్నారు.
ఉగ్రవాదుల నుండి భద్రకాళీ అమ్మవారి విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత, సైన్యం దానిని జమ్మూలోని శ్రీ రఘునాథ్ మందిర్ ట్రస్ట్ సంరక్షణలో ఉంచింది; పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిన అనంతరం, సైన్యానికి చెందిన ‘రాష్ట్రీయ రైఫిల్స్’ సహకారంతో హిందూ సమాజ ప్రతినిధులు 2018లో ఆ విగ్రహాన్ని ఆలయంలో శాస్త్రోక్తంగా తిరిగి ప్రతిష్ఠించారు.
భద్రకాళి అమ్మవారి ఆలయం హిందూ సమాజానికి ఎంతో కాలంగా ఒక పవిత్ర క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఇప్పుడు భక్తులు తిరిగి ఈ ఆలయానికి రావడం మొదలుపెట్టారు. ప్రతి భక్తుని ఆధార్ కార్డును పరిశీలించి, వారి పేరు మరియు చిరునామాను నమోదు చేసుకున్న తర్వాతే సైనిక సిబ్బంది ఆలయంలోకి ప్రవేశానికి అనుమతిస్తున్నారు. ఇక్కడ జంతు బలి ఆచారం కూడా ఒక సంప్రదాయంగా కొనసాగుతోంది.స్థానిక హిందువులు ఇక్కడ ‘భండారాల’ను నిర్వహించడం మరియు తమ ఆచారాలను పాటించడం ప్రారంభించారు. కాశ్మీర్ లోయలో సనాతన సంప్రదాయాల పునరుద్ధరణకు ఇది ఒక చక్కని ఉదాహరణగా నిలుస్తుంది.





