
22views
ఆర్మూర్ పట్టణంలోని భరత్ చంద్ర స్కూల్ లో ఉర్దూ బోధన చేస్తున్నారన్న విషయం బయటికి రావడంతో హిందువులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు ఉర్దూ పాటలు నేర్పడంతో పాటు కల్మా (నమాజ్) కూడా చెప్పిస్తున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొన్నారు. దీంతో హిందూ సంఘాలు, తల్లిదండ్రులు పాఠశాల వద్ద నిరసనకు దిగారు. భరత్ చంద్ర పాఠశాల ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న అమీర్ ఖాన్ పర్యవేక్షణలోనే ఉపాధ్యాయురాలు ఆలీమా ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థులకు ఉర్దూ పాటాలు కూడా నేర్పుతున్నారు.
ఈ విషయం రూఢీ కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల లోపలికి దూసుకెళ్లి, ప్రిన్సిపాల్ పై దాడికి దిగారు. తమ పిల్లలకు ఉర్దూ పాటలు, కల్మా నేర్పుతున్నారని, వారి పుస్తకాల్లో ఉర్దూ రాతలు కూడా వున్నాయని హిందూ సంఘాలు చెబుతున్నాయి.
కొంత మంది పిల్లల్ని స్కూల్ దశ నుంచి ఇతర మతాల్లోకి వెళ్లేలా వారిలో చెడు భావనలను నింపుతున్నారని, లవ్ జిహద్ వైపు వెళ్లేలా వారిని ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనిపై ఇప్పటికే ఎంఈవో,స్థానిక ఎమ్మార్వో సైతం రంగంలోకి దిగి విచారణకు ఆదేశించారు. మరోవైపు అనుమతిలేనిదే స్కూల్ లో ఉర్దు బోధనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అధికారులు ప్రశ్నించిన సమంయలో వారు అనర్గళంగా ఉర్దూ మాట్లాడటం, వారి నోటు బుక్ లలో ఉర్దూ రాతలు వుండటం చూసి తల్లిదండ్రులు, హిందూ సంఘాలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.





