
ఒక వృద్దుడు రాత్రి సమయంలో రహదారిపై ఏదో వెతుకుతున్నాడు. దాన్ని గమనించిన యువకుడు సహాయం చేయడానికి వచ్చి ‘తాతా, ఎం. వెతుకుతున్నావు?’ అని అడిగాడు బాబూ, నా అయిదు రూపాయల నాణెం పడిపోయింది.ఎంత వెతికినా దొరకడం లేదు’ అన్నాడు.’తాత ఎక్కడ పడింది” అని మళ్ళీ అడిగారు. దూరంగా చేయి చూపిస్తూ- అదిగో అక్కడ పడిపోయింది’ అన్నాడు. ‘అక్కడ పడిపోతే ఇక్కడ ఎందుకు వెతుకుతున్నావు? పోగొట్టుకున్న చోటే వెతకాలి కదా’ ఇన్నాడు. అక్కడ అంతా చీకటి. ఇక్కడ వీధి దీపం వెలుగు ఉంది. అందుకే ఇక్కడ వెతుకుతున్నా” అన్నాడు వృద్దుడు.
ఇది హాస్యాస్పదంగా ఉండవచ్చు కాని, చాలామందికి ఏదో సందర్భంలో ఇలాగే జరిగే అవకాశం ఉంటుంది. చాలామంది. తమ జీవితాల్లో ఎక్కడో పోగొట్టుకున్న సంతోషాలను మరెక్కడో వెతుక్కుంటారు. తాము పోగొట్టుకున్న లోటు తోటివారికి తెలియకుండా వైద్యం ఉన్నంతలో కర్తవ్యాన్ని నిర్వర్తించి తిరిగి శాంతిని పొందేవారు ధీరులని భర్తృహరి సుభాషితం చెబుతుంది. కురుక్షేత్ర సంగ్రామం రెండు కుటుంబాల మధ్య రాజ్యం కోసం కురువంశీయులు పాలించారు. అది కురురాజ్యంగా ప్రసిద్ధి చెందింది. అన్ని విధాలా అడ్డద్ధమైన పాండురాజు చక్రవర్తి అయ్యాడు. దిగ్విజయంగా రాజ్యాన్ని సుసంపన్నం గావించాడు. శాపవశాత్తు రాజ్యాన్ని వదలి ఆశ్రమవాసం చేయడంతో దృతరాష్ట్రుణ్ని రాజును చేశారు అహంకారంతో దుర్యోధనుడు పుత్ర వ్యామోహంతో ధృతరాష్ట్రుడు పాండవులకు రాజ్యాధికారాన్ని ఇవ్వకుండా బిగపట్టారు.
పాండవులు తమ రాజ్యాన్ని తమరు తిరిగి ఇవ్వమని కోరారు. అహంకారంతో అంగీకరించని కారణంగా కురుక్షేత్ర సంగ్రామం అనివార్యమైంది. తాము వంచనకు గురై పోగొట్టుకున్న కురురాజ్యం కోసం మాత్రమే పాండవులు యుద్ధం చేశారు. ఎక్కడ ఏది తాము కోల్పోయారో అక్కడే తిరిగి అధికారంలోకి వచ్చారు. తాము అవమానం పొందినచోటే సత్కారం పొందారు.





