News

యూనెస్కో జాబితాలో రామచరితమానస్, పంచతంత్రం, సహృదయలోక-లోకన రచనలు

243views

రామచరితమానస్, పంచతంత్ర, సహృదయలోక-లోకన రచనలను యునెస్కో ప్రపంచ ఆసియా-పసిఫిక్ ప్రాంతీయ పట్టికలో చేర్చింది. ఈ రచనలు భారతదేశపు గొప్ప సాహిత్య, సాంస్కృతిక వారసత్వాలకు ఈ రచనలు ప్రతీకలని యునెస్కో తెలిపింది. రామచరితమానస్, పంచతంత్రం, సహృదయలోక-లోకన వంటి రచనలు భారతీయ సాహిత్యం, సంస్కృతిని ప్రభావితం చేశాయని పేర్కొంది. ప్రపంచ సాంస్కృతిక పరిరక్షణ ప్రయత్నాలలో భాగంగా అపూర్వమైన సాహిత్య రచనలను గౌరవించడం ద్వారా, విశిష్ట రచనలను భవిష్యత్ తరాలకు అందిచవచ్చని పేర్కొంది. కాగా రామచరితమానస్ ను తులసిదాస్ రచించారు. పంచతంత్రను విష్ణు శర్మ సహృదయలోక-లోచనను ఆచార్య ఆనందవర్ధన్ రచించారు.