News

రాష్ట్రంలో నేడు ఎన్నికల పోలింగ్

263views

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలో 169 స్థానాలలో సోమవారం సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. కాగా పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల నుంచి వరకు, అరకు, పాడేరు, రంపచోడవరం నియోజక వర్గాలలో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. రాష్ట్రంలో 4 కోట్ల 14 లక్షల మంది ఓటర్ల కోసం మొత్తం 40 వేల 389 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 34 వేల 651 పోలింగ్ కేంద్రాలలో వెబ్ క్యాస్టింగ్ చేశారు. వీటిలో పోలింగ్ కేంద్రం మొత్తాన్ని పరిశీలించేలా సి సి కెమరాలు ఏర్పాటు చేయడం విశేషం. 12 వేల 438 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో 175 శానన సభా స్థానాలకు 2 వేల 387 మంది మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా, 25 లోక్ సభ స్థానాలకు 454 మంది అభ్యర్థులు పోటీలో వున్నారు. ఈ సారి పోలింగ్ శాతం గణనీయంగా పెంచడానికి కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు అనేక చర్యలు తీసుకున్నాయి.