News

కెనడా నుంచి ఎలాంటి ఆధారాలు అందలేదు…..నిజ్జర్ హత్యకేసుపై భారత్ స్పందన

313views

ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు భారత పౌరులను అరెస్టు చేసినట్లు మాత్రమే కెనడా తమకు తెలియజేసిందని భారత్ గురువారం పేర్కొంది. ఈ అంశంలో నిర్దిష్టంగా ఎలాంటి ఆధారాలను, సమాచారాన్ని మాత్రం అందించ లేదని తెలిపింది. అందుకే ఈ వ్యవహారంలో ముందే ఒక అభిప్రాయానికి వస్తున్నారని తాము చెబుతున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు. నిజ్జర్ హత్య కేసులో కరణ్ ప్రీత్ సింగ్ (28), కమల్ ప్రీత్ సింగ్ (22), కరణ్ బ్రార్ (22)లను కెనడా పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. వారు విద్యార్థి వీసాపై కెనడాలోకి ప్రవేశించినట్లు వార్తలు వచ్చాయి. “ఈ కేసులో రాజకీయ ప్రయోజ నాలు పనిచేస్తున్నట్లున్నాయి. వేర్పాటువాదులు, తీవ్రవా దులు, హింసను ప్రేరేపించేవారికి రాజకీయ వేదికలు కల్పించొద్దని మేం చాలా కాలంగా కోరుతున్నాం. కెనడాలో మా దౌత్యవేత్తలను బెదిరిస్తున్నారు. వారి విధులకు ఆటంకం కలిగిస్తున్నారు. వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతూ భారత్ సంబంధాలు ఉన్నవారు కెనడాలో ప్రవేశించడానికి, అక్కడ నివసించడానికి అనుమ తిస్తున్నారు. నేరగాళ్ల అప్పగింత కోసం ఆ దేశానికి అనేక విజ్ఞప్తులు చేశాం. అవి అక్కడ పెండింగ్ లో ఉన్నాయి. ఈ అంశాలన్నింటిపై కెనడాతో దౌత్య స్థాయిలో చర్చలు జరుపుతున్నాం” అని రణధీర్ పేర్కొన్నారు.