News

మహాభారతంపై పరిశోధనా గ్రంథం ఆవిష్కరణ

334views

మహాభారతం గ్రంథం కాలానుగుణంగా రూపాంతరం చేసుకుంటూ సమాజంలో చైతన్యం తీసుకువస్తుంది అనే కోణంలో పరిశోధన చేయడం అభినందనీయమని కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి.జ్ఞానమణి కొనియాడారు. కృష్ణా విశ్వవిద్యాలయం పరిశోధనా విద్యార్థి వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల సహాయ ఆచార్యుడు. డాక్టర్ విష్ణు వందనా దేవి పుస్తక రూపంలోకి తీసుకువచ్చిన ‘కథన రూపాంతరాలు – మహా భారతం సాంస్కృతిక పునశ్చరణల అన్వేషణ’ తన పరిశోధనా గ్రంథాన్ని ఉపకులపతి గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రచయిత ప్రయత్నాన్ని అభినందించారు. కార్యక్రమంలో పరిశోధనను పర్యవేక్షించిన ఆచార్య ఎన్.ఉష, రిజిస్ట్రార్ ఆచార్య కె.శోభన్బాబు, ఆంగ్ల విభాగం ఆచార్యుడు ఈ.దిలీప్ తదితరులు పాల్గొన్నారు.