News

అయోధ్య బాల రాముడ్ని దర్శించుకోనున్న ఉపరాష్ట్రపతి

271views

ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఈ రోజు అయోధ్యలో పర్యటిస్తారు. పారుతనలో భాగంగా ఉపరాష్ట్రపతి దంపతులు అయోధ్యలోని శ్రీ రామ్ లల్లా ఆలయాన్ని సందర్శించి బాలరామునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం హనుమాన్‌గర్హి ఆలయం, కుబేర్ తిలాలను సందర్శిస్తారు. అలాగే అయోధ్యలో సరయూ ఘాట్‌లో జరిగే హారతిలో ఉపరాష్ట్రపతి పాల్గొంటారని ఉపరాష్ట్రపతి కార్యాలయం తెలిపింది. కాగా ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా అయోధ్య రామాలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు.