News

దేశంలో నీగ్రో, మంగోలాయిడ్‌ ప్రజలు, అధీర్‌ రంజన్‌ చౌధురి వివాదాస్పద వ్యాఖ్యలు

330views

‘దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా ఉంటారు’ అంటూ కీలకమైన ఎన్నికల సమయంలో శామ్‌పిట్రోడా చేసిన వ్యాఖ్యల్ని ఆ పార్టీకే చెందిన మరో సీనియర్‌ నేత అధీర్‌ రంజన్‌ చౌధురి సమర్థించేలా మాట్లాడారు. శామ్‌పిట్రోడా వ్యాఖ్యలపై ఆయన స్పందన కోరగా.. ‘‘ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలపైనా నేనేమీ మాట్లాడదల్చుకోలేదు. మనదేశంలో ప్రోటో ఆస్ట్రలాయిడ్‌, నెగ్రిటా(నీగ్రో), మంగోలాయిడ్‌ జాతులకు చెందినవారున్నారు. మనదేశ నైసర్గిక స్వరూపం (టోపోగ్రఫీ) కారణంగా దేశంలో ఒక్కోచోట ఒక్కో రూపురేఖలున్నవారు ఉంటారు. ఇదే మనం నేర్చుకున్నది. అంద రూ ఒకలా ఉండరు. కొంతమంది నల్లగా.. కొంతమంది తెల్లగా ఉంటారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.