ArticlesNews

పరశురామావతారం

406views

( మే 10 – పరుశురామ జయంతి )

పరశురాముడు.. విష్ణుమూర్తి దశావతారములలో ఆరవ అవతారం. వైశాఖ శుద్ద తదియ రోజున పరశురాముడు జన్మించాడని స్కాంద, బ్రహ్మండ పురాణాలు చెబుతున్నాయి.అలాగే పరశురాముడి జయంతి కూడా త్రేతాయుగ ప్రారంభరోజే అని నమ్ముతుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం పరశురాముడి జయంతి వైశాఖ మాసంలో వస్తుంది. శుక్ల పక్షం మూడవ రోజున జయంతి జరుపుకుంటారు.

పరశురామ అంటే పార్షుతో రాముడు.. అది గొడ్డలి. క్రూరత్వం నుంచి భూమిని కాపాడటానికి పరశురాముడి అవతరించాడు. ఆయన శివ భక్తుడు. ఆయన ఆయుధం గొడ్డలి. పరశురాముడు ప్రసేనాజిత్ కుమార్తె రేణుక, బ్రిగు రాజవంశీయులైన జమదగ్ని దంపతులకు ఐదవ కుమారుడిగా జన్మించాడు. లక్ష్మీ అవతారమైన ధనవిని వివాహం చేసుకున్నాడు. హిందూ పురాణాల ప్రకారం పరశురాముడు అమరుడు. ఇప్పటికీ భూమిపై అతను ఉన్నట్లుగా నమ్ముతుంటారు. భీష్ముడు, ద్రోణాచారి, కర్ణుల గురువు పరశురాముడు.

హరి వంశ పురాణం ప్రకారం, బలిచక్రవర్తి పాలనలో అణిగిమణిగి ఉండిన రాజులు క్రమంగా తలలెత్తి విజృంభించసాగారు. బలంగల వాడిదే భూమి అయిపోయింది. రాజుల నిరంకుశ పాలనలో జనులు తల్లడిల్లిపోతున్నారు. అప్పుడు విష్ణువు దశావతారాల్లో ఆరవది పరశు రామావతారం దాల్చి ఇరవై ఒక్కసార్లు దండెత్తి క్షత్రి యులను అడవులను నరికినట్టుగా గండ్రగొడ్డలితో నిర్మూలించాడు. ఎప్పుడు ఏది అవసరమో అది సాధించడానికి అవతరిస్తూంటాడని నిరూపించాడు.