News

నేడు తెరుచుకోనున్న కేదార్ నాథ్ ఆలయం

257views

ఉత్తరాఖండ్ లోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలైన కేదార్ నాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు శుక్రవారం తెరుచుకోనున్నాయి. శీతాకాలంలో మూసేసిన ఈ ఆలయాలను ఇప్పుడు తెరవనున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ‘చార్ధామ్ యాత్ర’లో భాగమైన బద్రీనాథ్ ఆలయాన్ని ఈ నెల 12న తెరవనున్నారు. ఆనవాయితీ ప్రకారం.. 47 కి. మీ. దూరంలో ఉన్న ఉఖిమర్లోని ఓంకారేశ్వర్ ఆలయం నుంచి కేదార్ బాబా పంచముఖ విగ్రహాన్ని వాలంటీర్లు పాదరక్షలు లేకుండా కాలి నడకన భుజాలపై మోస్తూ తీసుకొచ్చినట్లు కేదార్నాథ్ ఆలయ కమిటీ మీడియా ఇంఛార్జి తెలిపారు.