News

‘దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లలా కన్పిస్తారు’ : శామ్‌ పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్య

312views

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శామ్‌ పిట్రోడా కొత్త దుమారానికి తెరలేపారు. భారత్‌ను విభిన్న దేశంగా అభివర్ణించే క్రమంలో ఆయన చెప్పిన పోలికలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయన జాతి వివక్షకు పాల్పడుతున్నారని దుయ్యబట్టింది.

శామ్‌ పిట్రోడా ఏమన్నారంటే..?
‘ది స్టేట్స్‌మన్’ పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో భారత ప్రజాస్వామ్యం, భిన్నత్వం గురించి ఆయన మాట్లాడారు. మనది వైవిధ్యమైన దేశం. తూర్పున ఉన్న ప్రజలు చైనీయుల్లా.. పశ్చిమ వాసులు అరబ్బులుగా కన్పిస్తారు. ఇక ఉత్తరాది వాళ్లు శ్వేతజాతీయులుగా.. దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్ల మాదిరిగా ఉంటారని వ్యాఖ్యానించారు.