
Chinese and Russian naval vessels participate in the Joint Sea-2014 naval drill outside Shanghai on the East China Sea, May 24, 2014. REUTERS/China Daily
224views
విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ కమాండింగ్ ఫ్లాగ్ ఆఫీసర్, రియర్ అడ్మిరల్ రాజేష్ ధన్‌ఖర్ నేతృత్వంలో తూర్పు నౌకాదళ ప్రతినిధి బృందం సింగపూర్‌లోని సమాచార ఫ్యూజన్ కేంద్రాన్ని సందర్శించింది. పర్యటన సందర్భంగా ప్రస్తుత సముద్ర భద్రత , పర్యావరణ పరిరక్షణ, వంటి అంశాలపై ప్రతినిధి బృందం చర్చలు జరిపిందని నౌకాదళ అధికారులు తెలిపారు.ఈ సమావేశంలో భాగస్వామ్య సముద్ర సవాళ్లను పరిష్కరించడానికి సహకార విధానాన్ని ప్రోత్సహించే చర్యలపై చర్చించినట్లు వివరించారు.ఈ పర్యటన ద్వారా సముద్ర భద్రతా సహకారాన్ని పెంపొందించడంతో పాటు భారత్, సింగపూర్ ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు దోహదం చేస్తాయని నౌకాదళ అధికారులు వెల్లడించారు.





