
394views
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్ర చివర్లో వాయిదా పడింది. ప్రయోగానికి ఉపయోగిస్తున్న అట్లాస్ రాకెట్ ఎగువ దశ లోని ఆక్సిజన్ వాల్వ్ సమస్య ఏర్పడిందని గుర్తించడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకు న్నారు. ఈ ప్రయోగాన్ని తిరిగి ఎప్పుడు చేపడతారనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. భారత కాల మానం ప్రకారం మంగళవారం ఉదయం 8.04 గంటలకు ఫ్లోరిడాలోని కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి బోయింగ్ కు చెందిన స్టారైనర్ వ్యోమనౌక నింగిలోకి పయనంకావాల్సింది. దీన్ని అటాస్
రాకెట్.. రోదసిలోకి మోసుకెళ్లాల్సి ఉంది. యాత్ర కోసం వ్యోమ గాములు సునీతా విలియమ్స్ బుచ్ విల్మారాలు వ్యోమ నౌకలోకి ప్రవేశిం చారు. రాకెట్లోని ఆక్సిజన్ ప్రెజర్-రిలీఫ్ వాల్వ్ లోపం తలె త్తినట్లు గమనించి కౌంట్హౌను నిలిపేసి ప్రయోగాన్ని వాయిదా వేశారు.





