
దక్షిణ చైనా సముద్రంలో వ్యూహాత్మక విధుల నిర్వహణలో భాగంగా భారత నౌకాదళానికి చెందిన మూడు యుద్ధనౌకలు సింగపూర్ చేరుకున్నాయి. రెండుదేశాల నౌకాదళాల మధ్య ఉన్న బలమైన బంధానికి ఇది నిదర్శనంగా భావిస్తున్నారు. దక్షిణ చైనా సముద్రంలో చైనా దురుసు చర్యలకు పాల్పడుతుండటంతో ఈ మోహరింపునకు ప్రాధాన్యం ఏర్పడింది. భారత్ కు చెందిన ఐఎన్ఎస్ ఢిల్లీ, శక్తి, కిల్టాన్ యుద్ధనౌకలు సోమవారం సింగపూర్ చేరుకున్నాయని నౌకాదళ అధికార ప్రతినిధి తెలిపారు. మూడు రోజుల పాటు ఈ వార్ షిప్ లు ఇక్కడే ఉంటాయి. అనంతరం ఈ యుద్ధనౌకలు మలేసియాకు ఆ తర్వాత ఫిలిప్పీన్స్ కు వెళతాయి. ప్రస్తుతం దక్షిణ చైనా సముద్రంలో ఫిలిప్పీన్స్ యుద్ధనౌకలతో చైనాకు సైనిక ప్రతిష్టంభన ఏర్ప డింది. దక్షిణ చైనా సముద్రం పూర్తిగా తనదేనని డ్రాగన్ వాదిస్తోంది. దీన్ని ఫిలిప్పీన్స్, మలేసియా, బ్రునై. తైవాన్లు వ్యతిరేకిస్తున్నాయి. సాగరంలో తన హక్కులను చాటుకునేందుకు ఫిలిప్పీన్స్. అమెరికా మద్దతుతో గస్తీ నిర్వహి స్తోంది. ఆ సమయంలో డ్రాగన్ నౌకాదళంతో ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి.





