మనందరికీ తెలిసిన 3 చేపల కథలో- చెరువు ఎండిపోతోందని గ్రహించిన మొదటి చేప- ఆపద వచ్చేట్లుంది.. మరో చోటుకు వెళ్దామంది. రెండోది- ప్రమాదం వచ్చినప్పడు తప్పించుకోవచ్చులెమ్మంది. మూడో చేప- ఆమాత్రానికే దిగులెందుకు అంది. మొదటిది మరో చెరువులోకి వెళ్లగా, రెండోది ఆపద వచ్చాక తప్పించుకుంది. తాపీగా ఉన్న మూడో చేప పట్టుబడింది. మహాభారతం శాంతిపర్వంలో భీష్ముడు చెప్పిన ఈ కథలో అనాగత విధాత, ప్రత్యున్నమతి, దీర్ఘసూత్రి- అంటూ ఆ చేపలకు పేర్లు పెట్టి.. వాటి తత్వాలను నిర్వచించాడు. మనలోనూ మూడు రకాల వాళ్లుంటారు. మొదటి రకంలా మానసిక అలజడులూ, ఆందోళనలను ముందే పసిగట్టి అప్రమత్తమై ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశిస్తారు. రెండో రకంవారు ఆపద కలిగి నప్పుడు సమయస్ఫూర్తితో అధిగమించి దైవాన్ని ఆశ్రయిస్తారు. మూడో రకంవారు నిర్లక్ష్యంతో కాలయాపన చేస్తూ మరణం సమీపించే వరకూ పరమాత్ముడి గురించిన ఊసే లేకుండా గడిపేస్తారు. ఈ చేపల్లో ఏ చేపలా ఉండాలో మనమే నిర్ణయించుకోవాలి.
381views
You Might Also Like
మంచి సంతానం కోసం
తల్లిదండ్రుల ఆచరణ బాగున్నపుడే చక్కటి సంతానం కలుగుతుందని పెద్దలు చెప్పారు. సంతానం కలుగడం పితృ ఋణం తీర్చుకునేందుకే అన్నారు. కుంతి భావాలు ఆదర్శమైనవి. అందుకే ధర్మరాజు పుట్టాడు....
ప్రకృతిని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది
భగవంతుడు మనిషికి ప్రసాదించిన అపూర్వమైన సంపద ప్రకృతి. నదులు, జలపాతాలు, కొండలు, కోనలు, పచ్చని అడవులు, పశుపక్ష్యాదులతో అలరారే ప్రకృతి మనకు లభించడం నిజంగా అదృష్టమే. మనిషి...
పురాణాల్లో మాతృమూర్తులు : మాతృత్వానికి త్యాగానికి ప్రతిరూపంగా నిలిచిన దేవకీదేవి
ద్వాపరయుగంలో శ్రీమహావిష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించినప్పుడు ఆయనకు జన్మనిచ్చిన పుణ్యమూర్తి దేవకీదేవి. భగవంతుడిని కన్న తల్లిగా దేవకీదేవికి భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. అయితే...
‘మన్ కీ బాత్’లో కడప రైతు.. వరదారెడ్డికి ప్రధాని మోదీ కితాబు
3
కడప జిల్లాకు చెందిన ఓ సాధారణ రైతు ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ప్రశంసలు అందుకున్నారు. సంప్రదాయ పంటలకు భిన్నంగా అవకాడో సాగు చేస్తూ విజయం సాధించిన...
మజ్లిస్ ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ అర్ధరాత్రి చర్యల వెనుక కారణాలు చెప్పాలన్న రాజాసింగ్
7
ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ను పార్టీ నుంచి బహిష్కరించడంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న...
ఇస్లాం ‘శ్రేష్ఠ ధర్మం’ అంటూ కర్ణాటక మంత్రి వ్యాఖ్యలు..
5
బెంగళూరు: కర్ణాటక విద్యాశాఖ మంత్రి బసవరాజ్ రాయారెడ్డి చేసిన ఇస్లాం మతంపై వ్యాఖ్యలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. కొప్పల్ జిల్లా కుక్నూర్ ప్రాంతంలో నిర్వహించిన...





