షిల్లాంగ్ రామకృష్ణ ఆశ్రమంలో ఒకరోజు ఆసక్తికరమైన సంఘటన జరిగింది. మఠానికి ఆనుకొని ఓ కుటుంబం ఉండేది. ఓ రోజు సాధు బృందమంతా రాత్రి భోజనం చేస్తున్న సమయంలో హఠాత్తుగా పక్కింటి పెద్దాయన ప్రత్యక్షమయ్యాడు. స్వాములందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడా గృహస్థు ‘క్షమించండి! స్వామీజీ ఇలా రావటం పొరపాటే! కానీ మా ఆవిడతో చిన్న వివాదం తలెత్తింది. అందుకే ఇలా వచ్చాను!’ అని వివరించాడు. ‘ఏమిటది?’ ఆశ్చర్యంగా ప్రశ్నించారు స్వామీజీలు. ‘మీ భోజనాల గదికి కొన్ని అడుగుల దూరంలోనే మా ఇల్లు ఉన్నందున మీ మాటలన్నీ వినిపిస్తుంటాయి. మీరంతా తినేటప్పుడు చాలా సరదాగా మాట్లాడుతుంటారు. ఆ నవ్వులు, కోలాహాలు విని మా ఆవిడ ‘స్వామీజీలు రుచికరమైన అనేక వంటలతో భోజనం చేస్తుంటారేమో! అందుకే వాళ్లు చాలా ఉల్లాసంగా ఉంటారు’ అంటుంటుంది. నేనేమో ‘లేదు! ఆశ్రమం ఆర్థికంగా అంత మంచి స్థితిలో లేదు. అన్ని రకాల వంటలు చేసుకునే అవకాశం లేదు. అలాంటప్పుడు స్వామీజీలు అద్భుతమైన పదార్థాలు ఎలా తినగలరు? వాళ్ల తత్త్వం అలాంటిది. సహజంగానే సంతోషంగా ఉంటారు’- అని చెబుతుంటాను. కానీ మా ఆవిడ నా మాటలను అంగీకరించటం లేదు. అందువల్ల నేను స్వయంగా చూసి తెలుసుకొని, నా భార్యకి అసలు సంగతేమిటో చెబుతామని వచ్చాను’ అన్నాడు. అప్పుడు స్వామీజీలందరూ మరింత ఉల్లాసంగా ఆయనను కూడా తమతో కలిసి తినమని ఆహ్వానించి, తమతో పాటు సాధారణ భోజనమే వడ్డించారు. ‘ఆనందం అనేది పరిస్థితుల్లో, పదార్థాల్లో ఉండదు. మన మనసులో ఉండాలి. ఆధ్యాత్మికతకు అదే ఆనవాలు’ అని నిరూపించారు. భర్త అనుభవపూర్వకంగా చూసి చెప్పగా.. ఆ గృహణికి విషయం బోధపడింది. అప్పటి నుంచి ప్రత్యేక దినాల్లో స్వయంగా తనే మిఠాయిలు, ఇతర ప్రత్యేక వంటకాలు తయారు చేసి ఆశ్రమానికి పంపిస్తుండేది.
303views
You Might Also Like
ఆలయ ప్రదక్షిణ : భక్తి, వినయం, అంతర్ముఖతకు ఆధ్యాత్మిక మార్గం
హిందూ ధర్మంలో ప్రతి ఆచారానికీ ఒక అంతరార్థం ఉంటుంది. ఆలయానికి వెళ్లడం, గర్భాలయ దర్శనం చేసుకోవడం, తీర్థప్రసాదాలు స్వీకరించడం, నమస్కరించడం వంటి ప్రతి సంప్రదాయమూ మనిషిని బాహ్య...
‘అద్వైతసిద్ధి’కి తెనాలి పరీక్ష
తెనాలి పరీక్ష". నేడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశ మైంది. ఇంతకీ ఏమిటీ పరీక్ష.. అంత కఠినంగా ఉంటుందా.. దేశం మొత్తమ్మీద ఒక్క తెనాలిలోనే ఎందుకు నిర్వహిస్తారు? ప్రధాని...
దయ చూపండంటున్నా.. మహిళకు షరియా శిక్ష 100 కొరడా దెబ్బలు
11
ఇండోనేషియాలోని వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళకు అక్కడి అధికారులు దారుణమైన శిక్ష విధించారు. అచే ప్రావిన్సులో ఈ ఘటన చోటుచేసుకుంది. బహిరంగంగా శిక్ష అమలు చేస్తున్న సమయంలో...
ఇరాన్లో హిజాబ్ నిబంధనలకు సవాల్.. స్కార్ఫ్ లేకుండానే 10K రేసులో పాల్గొన్న మహిళలు
10
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో జరిగిన 10 కిలోమీటర్ల రన్నింగ్ రేసులో పలువురు మహిళలు తలపై హిజాబ్ లేదా స్కార్ఫ్ ధరించకుండా పాల్గొన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా...
శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకోండి.. విద్యార్థులకు అజిత్ డోభాల్ పిలుపు
27
జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగాలని భారత జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ డోభాల్ విద్యార్థులకు సూచించారు. ఇందుకోసం శ్రీరాముడి జీవితాన్ని ఆదర్శంగా...
పాకిస్తాన్‌కు తాలిబాన్ వార్నింగ్.. ఆఫ్ఘన్‌లోకి అడుగుపెడితే తీవ్ర పరిణామాలే..
9
పాకిస్థాన్, తాలిబాన్ల మధ్య విభేదాలు మళ్లీ తీవ్ర రూపాన్ని దాల్చాయి. ఇటీవల పాకిస్థాన్‌లో జరిగిన ఒక భారీ తీవ్రవాద దాడి తర్వాత, ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వం ఇస్లామాబాద్‌కు...





