
267views
లోకకల్యాణం కోసం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాదనీరాజనం వేదికపై మే 6వ తేదీన 10వ విడత అయోధ్యకాండ అఖండ పారాయణం నిర్వహించనున్నట్లు టిటిడి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 7 నుండి 9 గంటల వరకు ఈ పారాయణాన్ని నిర్వహించనున్నారు.అయోధ్యకాండలోని శ్లోకాలు, యోగవాశిష్టం ధన్వంతరి మహామంత్రంలోని 25 శ్లోకాలు కలిపి మొత్తం 189 శ్లోకాలను పారాయణం చేయనున్నారు.ఎస్.వి.వేద విఙ్ఞాన పీఠం, ఎస్.వి.వేద విశ్వవిద్యాలయం, టీటీడీ వేదపండితులు, టీటీడీ సంభావన పండితులు, శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.





