296views
విశ్వశాంతి, సనాతన ధర్మం, గిరిజన సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అయిదు మండలాల్లో పాదయాత్ర నిర్వహిస్తున్నామని రామానందస్వామి శనివారం తెలిపారు. కృష్ణాపురం ఆశ్రమం నుంచి ఈ పాదయాత్ర మొదలు పెట్టామని పేర్కొన్నారు. ఈనెల 4 నుంచి 11వ తేదీ వరకు చింతపల్లి, గూడెంకొత్తవీధి, కొయ్యూరు, జి. మాడుగుల మీదుగా పాడేరు వరకు పాద యాత్ర నిర్వహిస్తున్నామని చెప్పారు. గిరిజన ప్రాంతంలోని హిందువులు, ధార్మిక సంస్థల ప్రతినిధులు ప్రతి గ్రామంలోని దేవాలయాల్లో పాదయాత్రలో రామానందస్వామి, భక్తులు శ్రీరామ భజనలు చేయాలని పిలుపునిచ్చారు. హిందు ధర్మాన్ని రక్షించుకునేందుకు పాటుప డాలని పేర్కొన్నారు. రఘుపతి, రమణ, మోహన్, ఉపాధ్యాయులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.





