ArticlesNews

వశిష్టుడు మొదలు, నేటి ఆధునికుల వరకు గోవును సేవించి ధన్యులైన వారెందరో

71views

ఆవును సేవించే వారికి అతి దుర్లభమైన వరాలు కూడా నెరవేరుతాయి. క్రూరత్వం, కోపం చూపకుండా ఎప్పుడూ జాగ్రత్తగా సంరక్షిస్తే ఆవు అన్ని కోర్కెలు తీరుస్తుంది. జితేంద్రియుడై, ప్రసన్న చిత్తంతో నిత్యం గోసేవ చేస్తే పుణ్యం దక్కుతుంది అని మహా భారతం అనుశాసన పర్వం 21/33`35 శ్లోకాల్లో వుంది. మహర్షి వశిష్ఠుడు ఆచరించిన గోపాలన, గోసేవ చాలా ప్రసిద్ధమైంది. గోతత్వాన్ని తెలుసుకున్న వారిలో ఆయన ప్రథముడు. ఆయన దగ్గర శబల అనే విశిష్టమైన ఆవు వుండతేది. ఆ శబల సంతానమైన నందిని గురించి సంస్కృత సాహిత్యలో చాలా ప్రస్తావన వుంది. మహా భారతంలో వశిష్ఠుడు గోసేవ మహత్తు గురించి రజా సౌదాసునికి వివరించాడు.

‘‘గావ: ప్రతిష్ఠా భూతానాం గావ: స్వస్త్యయనంమహత్‌
గావో భూతం చ భవ్యం చ గావ: పుష్ట సనాతనీ’’

మహా భారతంలోని అనుశాసన పర్వం. ఓ రాజా ఆవు మనుషులతో పాటు సమస్త జీవులకు ఆధారం. గోకల్యాణం మంగళకరం. సంపదలకు మూలం. ఆవు ఎక్కడ వుంటే అక్కడ ప్రశాంత వాతావరణం వుంటుందని, ఆవు శరీరం సర్వదేవతల నివాస స్థానమని వ్యాసుడు పేర్కొన్నారు.

శ్రీకృష్ణునికి గోపాలుడు అని పేరు వచ్చింది. ఆయన ఎంతో ప్రీతితో గోసేవ చేసేవాడు. కృష్ణభక్తుడు రసఖాన్‌ కూడా గోమహాత్యాన్ని అనేక విధాలుగా వర్ణించాడు. సత్యకామ జాబాలి గోసేవ ద్వారా దైవచింతన అలవడి మోక్షాన్ని సాధించాడని కఠోపనిషత్తు తెలిపింది. దిలీప మహారాజు చూపిన గోభక్తి వర్ణించాడు. దిలీపుడు ఎప్పుడూ గోసేవలోనే వుండేవాడు. నీడలా వుండేవాడు. ఆవుకు ఆహారపానీయాలు అందించనిదే తాను కూడా ఏదీ తీసుకునేవాడు కాదు.

వీలు వుంటే ప్రతి ఇంటా కనీసం ఒక ఆవును వుంచుకోవాలి. రాజు నిర్వర్తించవలసిన ప్రధాన కర్తవ్యాలలో గోసంరక్షణ కూడా ఒకటి. అని కౌటిల్యుడు తన అర్ధశాస్త్రంలో పేర్కొన్నాడు.