
199views
బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో బాంబు దాడి వ్యవహారానికి సంబంధించి చెన్నైలో ఎన్‌ఐఏ దర్యాప్తు చేపట్టింది. బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో గత నెల బాంబు పేలుడు సంభవించింది. ఘటనలో తొమ్మిది మంది గాయపడ్డారు. ఈ కేసు దర్యాప్తును ఎన్‌ఐఏ చేపట్టింది. ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో అరెస్టయిన అబ్దుల్ మదిన్ దాహాని చెన్నై ట్రిప్లికేన్‌కి తీసుకొచ్చి దర్యాప్తు చేస్తున్నారు. శనివారం ట్రిప్లికేన్‌లోని ఓ లాడ్జి, ఓ పాత భవనం వద్దకు తీసుకెళ్లి దర్యాప్తు చేస్తున్నారు.





