News

దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం ; చైనా విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెల్లడి

322views

బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధుల తోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. మరోవైపు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్న టిబెట్ స్వయం ప్రతిపత్తిపై మాత్రం తాము సంప్రదింపులు జరపబోమని స్పష్టంచే సింది. దలైలామాను వేర్పాటువాదిగా చైనా పేర్కొనకపో వడం ఈ మధ్య కాలంలో ఇదే తొలిసారి. అంతేకాకుండా బౌద్ధ మత గురువు వ్యక్తిగత భవిష్యత్తుపైనా చర్చించేం దుకు తాము సిద్ధమంటూ.. 88 ఏళ్ల దలైలామా భార త్లో తన 65 ఏళ్ల ప్రవాస జీవితానికి ముగింపు పలు కుతూ టిబెట్ వెళ్లేందుకు దారులు తెరిచే ఉన్నాయన్న ట్లుగా సంకేతాలు ఇచ్చింది. ఈ మేరకు చైనా ప్రభుత్వం, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వం మధ్య రహస్య చర్చలు జరిగినట్లు వచ్చిన వార్తలపై చైనా విదేశీ వ్యవ హారాల శాఖ అధికారప్రతినిధి వాంగ్ వెన్బిన్ స్పందిం చారు. ధర్మశాల కేంద్రంగా పనిచేసే ప్రవాసంలోని చైనా గ్రూప్ వేర్పాటువాద సంస్థేనని స్పష్టంచేశారు. “టిబెట్ స్వతంత్రం కోసం పనిచేస్తున్న ప్రవాసంలోని టిబెట్ ప్రభుత్వం చైనా చట్టాలను, రాజ్యాంగాన్ని ఉల్లంఘించే చట్టవ్యతిరేక సంస్థ. ప్రపంచంలోని ఏ దేశమూ దీనిని గుర్తించలేదు” అని చెప్పారు. టిబెట్ను చైనా షిజాంగ్ పిలుస్తున్న సంగతి తెలిసిందే.