
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీవో) భద్రతా బలగాల కోసం అత్యంత తేలికైన బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్‌ను అభివృద్ధి చేసింది. లెవెల్- 6 ముప్పుని సైతం ఎదుర్కొనేలా ఈ జాకెట్ ను రూపొందించింది. మందుగుండు సామగ్రి పేలుడు నుంచి కూడా రక్షణనిస్తుందని డీఆర్‌డీవో వెల్లడించింది.
కాన్పూర్‌లోని డిఫెన్స్ మెటీరియల్స్ అండ్ స్టోర్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ దీనిని తయారు చేసింది. దేశంలోనే అత్యంత తేలికైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఇదేనని పేర్కొంది. ఇటీవలే ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ను చంఢీగఢ్ లో విజయవంతంగా పరీక్షించినట్టు తెలిపింది.
జాకెట్‌కు ఎదురుభాగంలో ఉన్న ఫ్రంట్ హార్డ్ ఆర్మర్ ప్యానెల్ ఆరు బుల్లెట్ దెబ్బలను నిరోదించింది. ప్యానెల్ పాలిమర్‌ను మోనోలిథిక్ సిరామిక్ ప్లేట్‌తో తయారు చేశారు. ఆపరేషన్ సమయంలో సామర్థ్యాన్ని, సౌకర్యాన్ని పెంచేలా రూపకల్పన చేశారు.




