News

ఇంద్రకీలాద్రిపై ఘనంగా వసంత నవరాత్రోత్సవాలు

328views

దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో వసంత నవరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వసంత నవరాత్రోత్సవాలలో మూడో రోజైన గురువారం అమ్మవారికి చామంతి, మల్లెలతో అర్చన నిర్వహించారు. తొలుత ఆలయ ఈవో కేఎస్‌ రామరావు, స్థానాచార్య శివప్రసాద్‌ శర్మ, వైదిక కమిటీ సభ్యులు మురళీ రంగావజ్జుల శ్రీనివాసశాస్త్రి, అర్చకులు గోపాలకృష్ణా, ఏఈవో ఎన్‌. రమేష్‌బాబు అమ్మవారికి అర్చన నిర్వహించే పుష్పాలతో మూలవిరాట్‌ను దర్శించుకున్నారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ లక్ష్మీ గణపతి ప్రాంగణానికి చేరుకున్నారు. ప్రత్యేక వేదికపై కొలువుదీరి ఉన్న అమ్మవారి ఉత్సవ మూర్తికి తెల్లచామంతి, పచ్చ చామంతి, మల్లెలతో అర్చన నిర్వహించారు. అనంతరం అమ్మవారికి పంచహారతులు సేవ జరిగింది. ఈవో రామరావు అమ్మవారి పూజలో పాల్గొనగా, పూజ అనంతరం అర్చన నిర్వహించిన పుష్పాలను భక్తులకు పంపిణీ చేశారు.