News

అమలాపురం నుంచి భద్రాచలానికి ప్రత్యేక బస్సులు

308views

శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరిగే సీతారామ కల్యాణాన్ని పురస్కరించుకుని అమలాపురం డిపో నుంచి ఈ నెల 16వ తేదీ ఉదయం 8.30 నుంచి రాత్రి 7.00 గంటల వరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్‌ చల్లా సత్యనారాయణమూర్తి తెలిపారు. 17వ తేదీన శ్రీరామనవమి సందర్బంగా కల్యాణం ముగిసిన ఆనంతరం భద్రాచలం నుంచి తిరిగి అమలాపురం రావటానికి మధ్యాహ్నం 1.30 నుంచి రాత్రి 7.00 గంటల వరకు ప్రతీ 30 నిమిషాలకు సాధారణ చార్జీలతో ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు చెప్పారు. టికెట్లకు ఆన్‌లైన్‌లో అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ సౌకర్యం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులు వినియోగించుకోవాలని డీఎం సత్యనారాయణమూర్తి కోరారు.