
269views
జమ్మూకశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో గురువారం జరిగిన ఎన్ కౌంటర్ లో లష్కరే తోయిబా ఉగ్రవాదిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఫ్రెసిపొర గ్రామం రాజ్పార ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు అక్కడికి చేరుకున్నాయి. అనంతరం ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఎన్ కౌంటర్ మొదలైందని ఓ పోలీసు అధికారి తెలిపారు. మరణించిన ఉగ్రవాదిని శ్రీనగర్కుఉ చెందిన దనీశ్ షేక్ గా గుర్తించినట్లు పేర్కొన్నారు. అతడు నిషేధిత ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ (ఇది లష్కరే తోయిబా శాఖ)కు చెందినవాడని వెల్లడించారు. గత మూడు నెలల్లో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు జరిగిన తొలి ఎన్ కౌంటర్ ఇదేనని అధికారులు తెలిపారు.





